మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 ఆగస్టు 2024 (12:58 IST)

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చక్రం తిప్పనున్న రోజా? విజయ్ పార్టీలో చేరిక?

Roja selvamani
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పిన సినీ నటి రోజా ప్రస్తుతం రాష్ట్రం మారేందుకు సిద్ధంగా వున్నారు. ఏపీలో వుండి ఇక లాభం లేదనుకున్న రోజా.. తమిళనాడు రాజకీయాల్లో రాణించేందుకు సై అంటున్నారు. 2026 తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు రోజా రెడీ అవుతున్నారు. తెలుగు రాష్ట్రంలో ఇక టీడీపీ, జనసేనలో చేరితే వున్న పరువు కాస్త పోతుందని భావించిన రోజా.. తమిళనాడుకు జంప్ కావాలనుకుంటున్నారని.. సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. 
 
అలాగే కోలీవుడ్ టాప్ హీరో విజయ్ స్థాపించిన తమిళ వెట్రి కళగంలో రోజా చేరుతారనే ప్రచారం జరుగుతోంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేస్తుందని ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో ఎన్నికలకు ఇంకా సమయం వుండటంతో విజయ్ పార్టీలో చేరి రోజా కీలక స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
రోజా తమిళనాడు రాజకీయాల వైపు చూసేందుకు నగరి నియోజకవర్గ ప్రతికూల ప్రభావాలే కారణమని తెలుస్తోంది. సొంత పార్టీ నేతలే రోజాకు వ్యతిరేకంగా నడుచుకున్నారు. ఆమెను ఎమ్మెల్యేగా దించేయాలనుకున్నారు. ఇంకా ఆ సీటు కూడా దక్కనివ్వకుండా చేశారు. ఇదంతా చూసి విసిగిపోయిన రోజా.. ఇతర పార్టీలో చేరడం వేస్ట్.. సొంత పార్టీలో వుండటమూ వేస్ట్ అనుకుంది. అంతే తమిళనాడులోని విజయ్ పార్టీలో చేరి క్రియాశీలక పాత్ర పోషించేందుకు రెడీ అవుతోంది.