శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: శనివారం, 9 మార్చి 2019 (21:51 IST)

అంగరంగ వైభవంగా ఆకాశ్ అంబానీ- శ్లోకా మెహతా వివాహ మహోత్సవం(Video)

రిలయన్స్ అధినేత, ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముకేశ్‌ అంబానీ తనయుడు ఆకాశ్‌ అంబానీ, వజ్రాల కంపెనీ అధినేత రసెల్‌ మెహతా కుమార్తె శ్లోకా మెహతా వివాహం ఈరోజు మార్చి 9న అంగరంగవైభవంగా జరుగుతోంది. ఈ వేడుకకు దేశవిదేశాల నుంచి అతిరథమహారథులు తరలి వస్తున్నారు. 
 
వీరి వివాహం బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ సెంటర్‌లో జరుగుతోంది. పెళ్లి మంటపం అద్భతంగా తీర్చిదిద్దారు. నెమలి స్వాగతం పలుకుతోంది. రామచిలుకలు అందంగా పలుకరిస్తున్నాయి. ఇక సువాసనలు వెదజల్లే పుష్పాలు అతిథులకు ఆహ్వానం పలుకుతున్నాయి.
 
కాగా ఈ పెళ్లి వేడుకకు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, చెర్రీ బ్లెయిర్ దంపతులు విచ్చేశారు. వీరితోపాటు బాలీవుడ్ సెలబ్రిటీలు రణబీర్ కపూర్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, ప్రియాంకా చోప్రా, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్, దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్, క్రికెటర్ యువరాజ్ సింగ్, హార్దిక్ పటేల్, కునాల్ పాండ్యా వధూవరులను ఆశీర్వదించేందుకు వచ్చారు. అలాగే ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హొత్రా తదితరులు చేరుకున్నారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ దంపతులు హాజరయ్యారు. వీడియో చూడండి...