శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 16 జనవరి 2024 (18:13 IST)

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2024: ఏపీలో తెదేపా-జనసేన కూటమిదే అధికారం, ఎఫ్-జాక్ సమగ్ర సర్వే

pawan - sankranti - babu
దక్షిణ భారతదేశంలోని ప్రధాన రాజకీయ వ్యూహ సంస్థ ఎఫ్-జాక్ ఎలక్షన్ కన్సల్టెన్సీ, డిసెంబర్ 7, 2023 నుండి జనవరి 8, 2024 వరకు తమ సంస్థ  డైరెక్టర్ మహ్మద్ ఇర్ఫాన్ బాషా నేతృత్వంలో నిర్వహించిన సంచలనాత్మక సర్వేలో, రాబోయే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ దృశ్యం ఎలా వుండబోతుందో వెల్లడించింది. తెలుగుదేశం పార్టీ+జనసేన కూటమికి 88-116 సీట్లు రానున్నాయని తెలిపింది. అలాగే వైఎస్సార్‌సీపీకి 59-87 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు ఈ అధ్యయనం అంచనా వేసింది. దాదాపు 62,000 మందిని కంప్యూటర్-అసిస్టెడ్ టెలిఫోన్ ఇంటర్వ్యూ (CATI) పద్దతిలో ఇంటర్వ్యూ చేయటం ద్వారా ఈ అధ్యయనం చేశారు.  
 
ఎఫ్-జేఏసీ ఎలక్షన్ కన్సల్టెన్సీ అధ్యయనం ప్రకారం జనసేన 34 స్థానాల్లో ప్రభావం చూపుతుందని అంచనా. టీడీపీ కూటమి మరియు వైఎస్సార్‌సీపీ మధ్య 3% లేదా అంతకంటే తక్కువ మార్జిన్ ఉన్న 21 స్థానాలను నిశితంగా పరిశీలిస్తే ఈ ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నట్లు అవగతమవుతుంది.   గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, విశాఖపట్నంలలో టీడీపీ + జేఎస్‌ల ప్రాబల్యం కనబడితే,  కడప, కర్నూలులో వైఎస్సార్‌సీపీ బలం చూపనుంది. రిజర్వ్‌డ్ సీట్లు, మైనారిటీల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలు, బీజేపీ కూటమిలో చేరడం వల్ల వచ్చే ప్రభావం ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయి.  రాబోయే ఎన్నికలను అర్థం చేసుకోవడానికి ఈ సర్వే విలువైన సాధనంగా మారుతుంది.
 
F JAC survey 2024
సర్వే ఫలితాలు:
• రిజర్వు చేయబడిన సీట్లు:
మొత్తం 36 ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాల్లో, వైఎస్‌ఆర్‌సీపీ 22-24 స్థానాలను దక్కించుకునే అవకాశాలు వున్నాయి, నిర్దిష్ట నియోజకవర్గాల్లో పార్టీ ప్రభావాన్ని ఇది స్పష్టంగా వెల్లడిస్తుంది. 
• మైనారిటీల ఆధిపత్య స్థానాలు:
మైనారిటీల  ప్రభావం  కలిగిన  పన్నెండు సీట్లులో  7 వైఎస్సార్‌సీపీ వైపు, 5 తెలుగుదేశం పార్టీ + జనసేన వైపు మొగ్గు చూపుతున్నాయి. 
• BJP కూటమి ప్రభావం:
టిడిపి, జనసేన కూటమిలో బిజెపి చేరడం వల్ల కొంత మేర విజయంలో ప్రభావం చూపవచ్చు. 
• ఓటర్ సెంటిమెంట్ & ఓట్ షేర్:
టీడీపీ కూటమికి 48.26%, వైఎస్సార్‌సీపీకి 46.36% ఓట్లు వస్తాయని అంచనా. ప్రాంతాల వారీగా చూస్తే కోస్తాంధ్రలో తెలుగుదేశం పార్టీ+జనసేన ప్రాబల్యం ఉంటే, ఉత్తర ఆంధ్ర- రాయలసీమలో వైఎస్సార్‌సీపీ ప్రబలంగా ఉన్నట్లు కనిపిస్తుంది.
 
• ప్రస్తుత మంత్రి సీట్లు:
ప్రస్తుత మంత్రులు ఉన్న 27 స్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీలు చెరో 14 స్థానాలను దక్కించుకుంటాయని అంచనా.
 
• మహిళల ఓటింగ్ ట్రెండ్‌లు:
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) పథకాల కారణంగా మహిళలు ప్రధానంగా వైఎస్సార్‌సీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. కాకపోతే, రవాణాపై ఆధారపడిన కుటుంబాలు, కాంట్రాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు మరియు చిత్తూరు & నెల్లూరు జిల్లాల్లో రెడ్డి కమ్యూనిటీలో గుర్తించదగిన స్థాయిలో వ్యతిరేకత గమనించబడింది.
 
తెలంగాణ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్ నివేదికను కూడా ఎఫ్-జాక్ ఎలక్షన్ కన్సల్టెన్సీ గతంలో విడుదల చేసింది, ఇది కాంగ్రెస్ 64-74 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది.