సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By Selvi
Last Updated : సోమవారం, 23 జులై 2018 (17:20 IST)

అబ్బే.. ఏంటా మాటలు..? తేజస్విపై కామెంట్స్.. ఓ హద్దు ఉండదా?: నాని ఫైర్

సోషల్ మీడియాలో సెలెబ్రిటీలపై రకరకాలుగా స్పందిస్తున్న నెటిజన్లున్నారు. సెలెబ్రిటీలను ఏకిపారేసే వారు, వారిపై అసభ్య పదజాలాన్ని వాడేవారు చాలామందే వున్నారు. తాజాగా బిగ్‌బాస్ హోస్ట్ నాని నెటిజన్లపై ఫైరయ్యాడ

సోషల్ మీడియాలో సెలెబ్రిటీలపై రకరకాలుగా స్పందిస్తున్న నెటిజన్లున్నారు. సెలెబ్రిటీలను ఏకిపారేసే వారు, వారిపై అసభ్య పదజాలాన్ని వాడేవారు చాలామందే వున్నారు. తాజాగా బిగ్‌బాస్ హోస్ట్ నాని నెటిజన్లపై ఫైరయ్యాడు. బిగ్‌బాస్ హౌస్ సభ్యులపై నెటిజన్ల నుంచి వస్తున్న కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. హౌస్‌లోని అందరూ.. అందరికీ నచ్చాలనేమీ లేదన్నాడు. 
 
బిగ్ బాస్ హౌస్‌లోని వాళ్లందరూ.. ఆ విషయాన్ని చెప్పొచ్చని.. అయితే అసభ్య పదజాలంతో కామెంట్స్ చేయడం మాత్రం సబబు కాదంటూ నెటిజన్లకు నాని హితవు పలికాడు. అంతేగాకుండా తేజస్వి విషయంలో వస్తున్న కామెంట్స్ చూస్తుంటే బాధగా ఉందన్నాడు. బయట ఇలాంటి మనుషులు ఉన్నారా? అని అనిపిస్తోందన్నాడు. కామెంట్స్ చేయడానికి కూడా ఓ హద్దు ఉంటుందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. 
 
కాగా ఆదివారం బిగ్‌బాస్ హౌస్‌లో మంచు లక్ష్మి సందడి చేసింది. ‘వైఫ్ ఆఫ్ రామ్’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చిన ఆమె హౌస్‌మేట్స్‌తో కలిసి కాసేపు సందడిగా గడిపింది. 
 
లక్ష్మి కోసం రోల్‌రైడా ఓ పాట పాడాడు. గణేశ్ ఆర్జేగా అవతారమెత్తాడు. కాగా, ఈసారి నానికి బదులు మంచు లక్ష్మి ఎలిమినేషన్‌ను ప్రకటించింది. తేజస్వీ పేరు ప్రకటించగానే హౌస్‌లోని వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అందరూ కన్నీరు పెట్టుకున్నారు. ముఖ్యంగా సామ్రాట్‌కు నోటమాట రాలేదు. షో చివరి వరకు మూడీగానే ఉన్నాడు.
 
ఇక, తేజస్వీ వెళ్తూవెళ్తూ బిగ్‌బాంబ్‌ను గణేశ్‌పై విసిరింది. బిగ్‌బాంబ్‌లో భాగంగా గణేశ్ ఈ వారమంతా పాలసీసాతో నీళ్లు తాగాల్సి ఉంటుంది. అలాగే బిగ్ బాస్ హౌస్ నుండి బిగ్ బాస్ స్టేజ్ మీదికి వచ్చిన తేజస్వికి కంటెస్టెంట్స్‌తో కూడిన ఓ ఫోటో ఆల్బమ్‌ను అందించి ఆ ఫోటో ఎదురు వాళ్ల గురించి కామెంట్.. అలానే మార్కులను కూడా వేయాలని నాని చిన్న టాస్క్ ఇచ్చారు. 
 
దీనిలో భాగంగా తనీష్, సామ్రాట్, బాబు గోగినేనిలకు పదికి పది మార్కులు వేయగా.. రోల్ రైడాకి పదికి ఏడు మార్కులు మిగిలిన వాళ్లందరికీ ఎనిమిదికి పది మార్కులను వేసింది. ఇక కౌశల్‌కి మాత్రం అందరి కంటే తక్కువగా పదికి ఐదు మార్కులు వేయడమే కాకుండా అతడిపై సంచలన కామెంట్స్ చేసింది. ''కౌశల్ నువ్వు బిగ్‌బాస్ టైటిల్ గెలుస్తావేమో.. కాని నేను బిగ్‌బాస్ హౌస్‌లో అందరి మనసుల్ని గెలుచుకున్నాను'' అంటూ తేజస్విని తెలిపింది.