శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By కుమార్
Last Updated : శుక్రవారం, 29 మార్చి 2019 (14:11 IST)

ఎన్నికల బరిలో బిగ్‌బాస్ 2 కంటెస్టెంట్ సంజన

బిగ్‌బాస్ 2లో సామాన్యురాలిగా ప్రవేశించి, మాటలతో హీటెక్కించి వివాదాలు సృష్టించిన కంటెస్టెంట్ సంజన ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నేనే రాజు నేనే మంత్రి సినిమాలో ఒక చిన్న పాత్ర వేసిన సంజన బిగ్‌బాస్ 2లో కంటెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈమె ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 
 
నూజివీడు అసెంబ్లీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా సంజన బరిలోకి దిగారు. సంజన అసలు పేరు అన్నే వనజ, ఈమె స్వస్థలం నూజివీడు మండలం అరిగిపల్లి మండలం కృష్ణవరం. ఈమె తండ్రి కోటేశ్వరరావు రైతు. 
 
2016లో మిస్ హైదరాబాద్‌గా గెలిచిన అన్నే వనజ ఆ తర్వాత ఆమె పేరును సంజనగా మార్చుకున్నారు. నూజివీడు నుండి కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ కోసం ప్రయత్నించి టిక్కెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈమె దివంగత నాయకుడైన మాజీ ఎమ్మెల్సీ, మంత్రి పాలడుగు వెంకట్రావుకు సమీప బంధువు.