ఈ కేరళ వ్యక్తి అదృష్టవంతుడు.. లక్కియస్ట్ మ్యాన్ ఆఫ్ ది మంత్ అవార్డు అతనికే..? (video)
Kerala Man
వివరాల్లోకి వెళితే.. కేరళలోని కొల్లం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి రోడ్డు మీద ఎడమచేతి వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెనుక నుంచి చాలా వాహనాలు వస్తున్నాయి. రోడ్డుకి అంచున నడుస్తుండడంతో అతనికి ఏం కాలేదు. ఒక వాహనం మాత్రం రయ్.. రయ్ మంటూ అతని మీదకు దూసుకువచ్చింది.
వాహనం వెళ్లిన వేగానికి ఆ వ్యక్తి కిందపడి నుజ్జునుజ్జు అయి ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ అతను క్షేమంగా రోడ్డు మీదనే ఉన్నాడు. చూసినవారికే అలా ఉంటే ఇక ఆ వ్యక్తికి ఇంకెలా ఉంటుంది. దేవుడా తప్పించుకున్నాను అంటూ రోడ్డు పక్కకి పరుగులు పెట్టాడు.
22 సెకన్ల పాటు నడిచే ఈ వీడియోను మైక్రో- బ్లాగింగ్ సైట్ యూజర్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. 'లక్కియస్ట్ మ్యాన్ ఆఫ్ ది మంత్ అవార్డు ఈ వ్యక్తికి వెళుతుంది' అనే శీర్షికను జోడించారు. ఈ శీర్షిక అతనికి సరైనదని అంటున్నారు నెటిజన్లు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Luckiest man of the month award goes to this man.
— Nisar നിസാർ (@nisarpari) August 22, 2020
Chavara, Kollam District,Kerala. pic.twitter.com/dAGnteQpDe
