శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : సోమవారం, 9 సెప్టెంబరు 2019 (15:52 IST)

హార్డ్ ల్యాండింగ్ జరిగినా విక్రమ్ ముక్కలు కాలేదట

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు చంద్రయాన్-2. ఈ ప్రాజెక్టు చివరిక్షణంలో సఫలం కాలేక పోయింది. విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కావాల్సివుండగా, సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఫలితంగా చంద్రుడి ఉప‌రిత‌లం నుంచి సుమారు 2.1 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న‌ప్పుడు విక్ర‌మ్ గ‌తి త‌ప్పిపోయి... హార్డ్ ల్యాండింగ్ అయింది. అయితే, ఈ ల్యాండర్ కిందపడినప్పటికీ ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని ఇస్రో వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. 
 
ఇస్రో అనుకున్న ప్రాంతంలో విక్ర‌మ్ దిగ‌క‌పోయినా.. అది ప‌డ్డ ప్రాంతంలో మాత్రం ప‌క్క‌కు ఒరిగిన‌ట్టుగా ఉంద‌ని శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు. నిజానికి విక్ర‌మ్ ల్యాండ‌ర్‌కు ఏమైంద‌న్న విష‌యం స్ప‌ష్టంగా తెలియ‌క‌పోయినా.. క‌మ్యూనికేష‌న్ పున‌రుద్ద‌రించేంత వ‌ర‌కు ఏమీ చెప్ప‌లేమ‌ని ఇస్రో వ‌ర్గాలు తెలిపాయి. 
 
విక్ర‌మ్ కూలి రెండు రోజులు గ‌డుస్తోంది. ఇంకా 12 రోజుల పాటు దాని సంకేతాల గురించి ప్ర‌య‌త్నించ‌నున్న‌ట్లు ఇస్రో చెబుతోంది. విక్ర‌మ్ స‌రిగా ఉంటేనే.. దాంట్లో ఉన్న రోవ‌ర్ ప్ర‌జ్ఞాన్ బ‌య‌ట‌కు వ‌చ్చి చంద్రుడిపై కాలుమోపి.. ఫోటోలను తీసి భూమిమీదికి చేరవేస్తుంది.