సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2019 (12:39 IST)

ఇంగ్లీష్ మీడియంపై జాతీయ వర్గాల ఆరా…?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్బంధ వైఖరిపై ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెనక్కి తగ్గకపోవడానికి కారణం ఏంటి అంటూ ఆరా తీస్తున్నారు పలువురు. ఆయన కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని పదే పదే చెప్పడం వెనుక అసలు వాస్తవ కారణం ఏమై ఉంటుంది అనేది ఎవరికి అంతుబట్టడం లేదు. 
 
ఇక దీని గురించి మాట్లాడిన వాళ్ళ విషయంలో… మంత్రులు ఎమ్మెల్యేలు, పార్టీ మారాలనుకునే వాళ్ళు చేస్తున్న ఎదురు దాడి, రకరకాల విషయాలు ఇప్పుడు ప్రజలను మరింత అనుమానాలకు గురిచేస్తున్నాయి. ఇప్పుడు దీనిపై జాతీయ పార్టీల్లో కూడా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా టీడీపీ ఎంపీ కేశినేని నానీ… పార్లమెంటులో ప్రస్తావించారు. తెలుగు భాష భవిష్యత్తుకి భరోసా కల్పించాలని, తెలుగు విషయాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకోవాలని ఆయన కోరారు. 
 
దీనిపై ఇప్పుడు జాతీయ నేతలు… అసలు జగన్ ప్రభుత్వం ఇంత పట్టుదలగా ఉండటానికి కారణం ఏంటి…? రాజకీయ వ్యూహాల కోసమొ లేక ఇతర కారణాల కోసమా? ప్రాంతీయ భాషపై కత్తి కట్టడం ఏంటి అంటూ ఎంపీలు టీడీపీని ఆరా తీసినట్టు తెలుస్తుంది. దీని వెనుక క్రైస్తవ మత ప్రభావం ఉంది అనేది కొందరి వాదన. 
 
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ టీచర్లకు ఇంగ్లీష్ మీద అవగాహన లేదు. క్రైస్తవ మతంలో ఉన్న టీచర్లకు దానిపై పూర్తి అవగాహన ఉంది. దీనితో క్రైస్తవ మత స్కూల్స్‌కి ఆదరణ పెరుగుతుందని, అందుకే ఈ నిర్ణయాన్ని జగన్ అంత పక్కాగా అమలు చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో మత ప్రచారం అనేది తీవ్ర స్థాయిలో జరుగుతుంది. కేంద్రం కూడా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయినట్టు సమాచారం.