శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 14 డిశెంబరు 2021 (14:03 IST)

రోజా ప్రయాణిస్తున్న విమానం దారి మళ్లింపు, డోర్లు ఓపెన్ కావడం లేదన్న ఎమ్మెల్యే

నగరి ఎమ్మెల్యే రోజా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానాన్ని దారి మళ్లించారు. రాజమహేంద్రవరం నుంచి తిరుపతి రేణిగుంట వస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానాన్ని బెంగళూరుకి తరలించారు.

 
విమానం సురక్షితంగా బెంగళూరులో ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. ఐతే తామింకా విమానంలోనే వున్నామంటూ రోజా ఓ వీడియో షేర్ చేసారు. విమానం డోర్లు తెరుచుకోవడంలేదనీ, తామింకా ఫ్లైట్లోనే వున్నట్లు రోజా తెలిపారు. అధికారుల నుంచి అనుమతి వచ్చాక డోర్లు తీస్తామని సిబ్బంది చెపుతున్నట్లు ఆమె తెలిపారు. కాగా రోజాతో పాటు విమానంలో 70 మంది వున్నారు.