శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: శనివారం, 4 డిశెంబరు 2021 (22:50 IST)

శిరోజాల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తలస్నానం తర్వాత చిక్కులుపడిన జుట్టును దువ్వెనతో విడదీసే ప్రయత్నాలు చేస్తుంటారు. దీనివల్ల జుట్టు తెగిపోతుంది. అందువల్ల జుట్టు తడిగా వున్నా, పొడిగా వున్నా ముందుగా వేళ్లతో విడదీయాలి. తర్వాత దువ్వెనతో దువ్వుకోవాలి.

 
తడి జుట్టును త్వరగా ఆరబెట్టుకోవాలని చాలామంది డ్రయ్యర్లు వాడుతుంటారు. అయితే వీటివల్ల శిరోజాల్లో సహజనూనెలు, తేమ తగ్గిపోయి జుట్టు పొడిబారుతుంది. డ్రయర్స్ నుంచి వచ్చే వేడివల్ల జుట్టుకు హాని జరుగుతుంది. అలాగే జుట్టు తడిగా వున్నప్పుడు కొందరు జడ వేసేసుకుంటారు. ఇలా చేయకూడదు. తల తడిగా వున్నప్పుడు కేశాలు ఆరే వరకూ అలా వదిలేయాలి. ఇలా చిన్నిచిన్న జాగ్రత్తలతో శిరోజాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

 
అలాగే ఉసిరి, మెంతి, వేపాకులు, తులసి, కరివేపాకు వంటివి శిరోజాలకు మేలు చేస్తాయి. తలంటు స్నానం చేసేముందు కాస్త నూనె తీసుకుని మాడుపై అప్లై చేసి మసాజ్ చేయాలి. అలా చేస్తుంటే జుట్టు కుదుళ్లు గట్టిపడతాయి.