గురువారం, 14 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 25 ఫిబ్రవరి 2021 (20:26 IST)

నాతో ఐదేళ్లు సహజీవనం చేసాడు, ఇప్పుడు చంపేయాలని ప్లాన్: నటి ఫిర్యాదు

అర్జున్ రెడ్డి చిత్రంలో మెరిసిన నటి శ్రీ సుధ తనపై హత్యాయత్నం జరిగిందని విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసారు. గతంలో తనతో ఐదేళ్ల పాటు సహజీవనం చేసిన సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడుపై తనకు అనుమానం వుందంటూ అందులో పేర్కొన్నారు.
 
నాయుడుపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని పలుమార్లు బెదిరించాడనీ, అందులో భాగంగానే తనను హత్య చేసేందుకు కారును యాక్సిడెంటుకు గురి చేశాడని అనుమానం వ్యక్తం చేశారు.
 
శ్యామ్ కె నాయుడుపై పెట్టిన కేసును రాజీ కుదుర్చుకున్నట్లుగా నకిలీ పత్రాలు సృష్టించారనీ, అది ఫేక్ అని నిరూపించినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం తనకు అతడితో ప్రాణభయం వుందని విజయవాడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది శ్రీసుధ.