గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2021 (14:44 IST)

స‌మంత కోసం ఎదురుచూస్తున్న గుణ‌శేఖ‌ర్ టీమ్‌

Shakuntalam poster
క‌థానాయిక‌గా 11 సంవ‌త్స‌రాలు అయిన సంద‌ర్భంగా స‌మంత‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ గుణ‌శేఖ‌ర్ యూనిట్ శుభాకాంక్ష‌లు తెలుపుతూ పోస్ట‌ర్ రిలీజ్ చేసింది. `అవ‌ర్ టీమ్ వెరీ ఎగ్జ‌యిటెడ్ టు బి వ‌ర్కింగ్ విత్ యు` అంటూ ట్వీట్ చేసింది. ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ త‌న‌ స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిచనున్నాడు. విజయ్ సేతుపతి, నయనతార ఇందులో న‌టిస్తున్నారు.
 
గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాలో స‌మంత ప్ర‌ధాన పాత్ర పోషిస్తోంది. దుష్యంతుని క‌థ‌, శాకుంత‌ల‌ను వివాహం చేసుకోవ‌డం, ఆ త‌ర్వాత శాపంతో మ‌ర్చిపోవ‌డం, ముని ఆశ్ర‌మంలోకి వెళ్ళ‌డం ఇదంతా పౌరాణికంగా చ‌దివిన క‌థే. దీన్ని సినిమాటిక్‌గా మారుస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలుకానుందని ఎప్పటినుంచో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు.  మార్చి 20 నుండి మొదలుకానుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషలలోను విడుదల‌చేసేలా స‌న్నాహాలు చేస్తున్నారు.