శుక్రవారం, 1 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 19 మే 2022 (13:06 IST)

రూ. 11 కోట్ల ఆస్తిని మత సంస్థలకు విరాళమిచ్చి భార్యాబిడ్డలతో ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లాడు

spiritual
ప్రస్తుత కాలంలో సంపద కోసం రేయింబవళ్లు, అహర్నిశం శ్రమిస్తుంటారు చాలామంది. అయితే మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ జిల్లాలో ఓ బంగారు నగల వ్యాపారి తన యావదాస్తిని గోశాలకు మత సంస్థలకు విరాళంగా ఇచ్చేసి ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని నిర్ణయించుకున్నాడు.

 
అతడు సుమారుగా 11 కోట్ల ఆస్తిని విరాళంగా ఇస్తానని ప్రకటించాడు. ఆ ఆస్తులను అప్పజెప్పి తన భార్య లీనా (36), కుమారుడు అమయ్(11)తో కలిసి లౌకిక జీవితాన్ని త్యజించి ఆధ్యాత్మిక మార్గంలో వెళుతున్నట్లు ప్రకటించాడు. జైపూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ముగ్గురు సభ్యులు దీక్ష చేపట్టనున్నారు.

 
వారి నిర్ణయాన్ని విన్న స్థానికులు సంభ్రమానికి లోనయ్యారు. కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చేసి కట్టుబట్టలతో అలా వెళ్లిపోతున్న ఆ కుటుంబాన్ని రథంపై ఎక్కించి ఊరేగించారు.