బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 16 జులై 2022 (18:01 IST)

జవాన్ల పాదాలకు నమస్కరించిన చిన్నారి.. వీడియో వైరల్ (Video)

girl touch jawan feet
ఓ మెట్రో స్టేషన్‌లో నిల్చొనివున్న ఆర్మీ జవాన్ల పాదాలకు ఓ చిన్నారి పాదాభివందనం చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను బెంగుళూరు ఎంపీ పీసీ మోహన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. "యువతకు ఇటువంటి విలువలను అందించడం అనేది దేశం పట్ల ప్రతి తల్లిదండ్రుల కర్తవ్యం అవుతుంది" అని రాసుకొచ్చాడు. 
 
నలుగురు ఆర్మీ జవాన్లు ఓ మెట్రో స్టేషన్ వద్ద నిలబడి వుండటం ఈ వీడియోలో కనిపిస్తుంది. అపుడు వారి వద్దకు ఓ చిన్నారి పరుగెత్తుకుంటూ వెళ్లి కొద్దిసేవు వారిని అలా చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత ఒక జవాను పాదాన్ని తాకి దండం పెట్టుకుంటుంది. దీంతో ఆ సైనికుడు భావోద్వేగానికి గురై ఆయన చిన్నారిని ఆప్యాయంగా రెండు చెంపలు తాకి ఆశీర్వదిస్తాడు. ఈ వీడియోను ఇప్పటికే 9 లక్షల మంది వరకు చూశారు. ఆరు లక్షల మంది లైక్ చేసారు.