ఎద్దులపై భారాన్ని తగ్గించేందుకు రైతు కొత్త ఐడియా, హ్యాట్సాఫ్
ఎడ్లబండిని బరువులతో లాగలేక లాగుతుంటాయి కొన్ని ఎద్దులు. ఇలాంటి బాధ నుంచి వాటికి విముక్తి కల్పించాలని ఓ రైతు తీవ్రంగా ఆలోచన చేసాడు. చివరికి వాటి భారాన్ని తగ్గించే ఫార్ములా కనిపెట్టాడు.
మూగ జీవాలపై ఎడ్ల బండి భారాన్ని తగ్గించేందుకు ఆదిలాబాద్ జిల్లా 'విప్పర్ వాడ' గ్రామానికి చెందిన ఒక యువరైతు కొత్త తరహాలో ఉపాయం ఆలోచించారు. ఎడ్ల యొక్క వెన్నుపై పడే భారం నుంచి ఉపశమనం కలిగే విధంగా ముందు భాగంలో అదనపు చక్రాన్ని అమర్చారు.
ఈ చక్రం వల్ల ఎడ్లపై భారం తగ్గుతుంది. బండిని తేలికగా ముందుకు తీసుకెళ్తాయి. ఇది ఒక మంచి ఇన్నోవేషన్ అని యువరైతుకి ప్రశంసలు కురిపస్తున్నారు.