సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శుక్రవారం, 23 నవంబరు 2018 (13:34 IST)

తొలిసారి పైలెట్‌గా అవతారం.. అమ్మమ్మ వద్ద విమానంలోనే ఆశీర్వాదం.. (వీడియో)

ఇండిగో పైలట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ పైలట్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తొలిసారి పైలట్‌గా ఉద్యోగం తీసుకున్న అతను.. ఆ విమానంలో తన తల్లిని, అమ్మమ్మను ఎక్కించుకున్నాడు.


అంతేగాకుండా విమానంలో పైలెట్‌గా మారే ముందు.. తల్లిని, అమ్మమ్మ పాదాలను నమస్కరించుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. ప్రదీప్ కృష్ణన్ అనే వ్యక్తికి ఇండిగో సంస్థలో పైలట్‌గా ఉద్యోగం వచ్చింది. సింగపూర్ వెళ్లే విమానానికి తొలుత డ్యూటీ వేశారు. అందులోనే అతని తల్లి, అమ్మమ్మ, సోదరి సింగపూర్ వెళ్తున్నారు. 
 
ప్రయాణీకులంతా తమ సీట్లలో కూర్చున్న తర్వాత విమానం టేకాఫ్ ముందు కృష్ణన్ తన తల్లి వద్దకొచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. పైలట్‌గా ఎదిగిన మనుమడి చేతిని అమ్మమ్మ గర్వంతో ముద్దాడింది.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ప్రదీప్ కృష్ణన్ స్నేహితులు ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. 188,992 వ్యూస్ వచ్చిన ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.