మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Updated : బుధవారం, 21 నవంబరు 2018 (14:43 IST)

వామ్మో... విమానం పడిపోతోంది పరుగెత్తండ్రో నాయనోయ్... పైలెట్ లేచి నిల్చున్నాడు...

హైదరాబాద్ శివారులో ఈ రోజు ఉదయం ఓ శిక్షణా విమానం కుప్పకూలింది. శంకర్‌ప‌ల్లి మండలం మొకిల గ్రామంలోని ఓ వ్యవసాయ పొలంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
ఆకాశంలో ప్రయాణిస్తూ ఒక్కసారిగా విమానం రివ్వుమంటూ పంట పొలాలపైకి దూసుకు వస్తుండటంతో సమీపంలో వున్న స్థానికులు పరుగులు తీశారు. శబ్దం చేస్తూ విమానం దబ్బున పడిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికి పొలంలో పనిచేసుకునేవారు అక్కడికి వెళ్లి చూడగా విమాన శకలాలను తప్పిస్తూ పైలెట్ లేచి నిలబడ్డాడు. అతడికి గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.
 
కాగా పొలంలో పడిన విమాన శకలాలను చూసేందుకు సమీపంలో నివశిస్తున్న ప్రజలు తరలివస్తున్నారు. వాటితో ఫొటోలు దిగేందుకు పోటీపడుతున్నారు.