దిశా కేసులో నిందితులకు శిక్ష పడదు, వాళ్లు బైటకు వస్తారు, జనం కొట్టి చంపుతారు
సంచలన వ్యాఖ్యలకు మారుపేరు అని పిలుచుకునే తెలంగాణలోని భాజపా ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేశారు. దిశ అత్యాచారం, హత్య గురించి ఆయన మాట్లాడుతూ.. దిశా కేసులో నిందితులకు శిక్ష పడదు, ఎందుకంటే పోలీసులు సరిగా వ్యవహరించలేదు, కాబట్టి వాళ్ళు బయటకు వస్తారు, ఆ తర్వాత జనం వారిని కొట్టి చంపుతారు. ఇది నిజం అంటూ రాజా సింగ్ చెప్పారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ... తన నియోజకవర్గంలో పర్యటించేటప్పుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రోటోకాల్ పాటించడంలేదని కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని మారుస్తారంటూ ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో తెలంగాణా పార్టీ అధ్యక్షుడుగా నాకు ఎవరు కనిపించడం లేదని, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అయితే బాగుంటుందన్నారు.
డీకే అరుణతో పాటు ఎవరికి ఇచ్చిన ఫరవాలేదని,
తాను ఎమ్మెల్యేగా గెలువొద్దని మా పార్టీ నేతలు చాలామంది ప్రయత్నాలు చేశారన్నారు. పార్టీలో కొందరు టికెట్ రాకుండా అడ్దుకున్నారని, అమిత్ షానే తనకు టికెట్ ఇచ్చారన్నారు. పార్టీలో తన ఎదుగుదలను రాష్ట్ర నాయకులు అడ్డుకుంటున్నారని, పార్టీ ఎల్పీ లీడర్‌గా తనను గుర్తించడం లేదన్నారు. తనకు ఏ పదవులు వద్దనీ, తన దారి వేరని అన్నారు. సీఎం కావాలని కలలు కంటున్న వారు తమ పార్టీ లో చాలామంది ఉన్నారన్నారు. కానీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి
యోగి ఆడిత్యనాథ్ తనకు మార్గదర్శని మనసులో మాట బయటపెట్టారు.