శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : బుధవారం, 30 జనవరి 2019 (08:53 IST)

ఆస్పత్రిలో పడకపై జయలలిత ఎలా ఉన్నారు.. డ్యూటీ డాక్టర్ ఏం చెప్పారు?

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం కారణంగా గత 2016 సంవత్సరం డిసెంబరు 5వ తేదీన చనిపోయారు. ఈమె దాదాపు 75 రోజుల పాటు చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొంది చివరకు ప్రాణాలు విడిచారు. ఆ సమయంలో జయలలిత ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి చనిపోయే ముందు రోజైన డిసెంబరు 4వ తేదీ వరకు డ్యూటీ డాక్టరుగా ఉన్న శిల్ప తాజాగా సంచలన విషయాన్ని వెల్లడించారు. 
 
అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతున్నసమయంలో ఆమె మానసికస్థితి అస్థిరంగా ఉండేదని, పలు సందర్భాల్లో ఒంటరిగా ఉండేందుకే ఎక్కువగా ఇష్టపడేవారని ఆమెకు చికిత్స చేసిన డాక్టర్‌ శిల్ప వెల్లడించారు. ఈ మేరకు జయ మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిటీ ఎదుట ఆమె సాక్ష్యమిచ్చారు. కొన్ని సందర్భాల్లో జయలలిత నవ్వుతూ ఉండేవారని, మరికొన్ని సమయాల్లో 'నన్ను ఒంటరిగా ఉండనివ్వండి' అంటూ కసురుకునేవారని తెలిపింది. కాగా, జయలలిత అనారోగ్యం కారణంగా 2016 సెప్టెంబరు 22వ తేదీన ఆస్పత్రిలో చేరారు.