గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సందీప్ కుమార్
Last Updated : శుక్రవారం, 30 ఆగస్టు 2019 (16:29 IST)

గడ్డి తింటున్న సింహం.. వీడియో వైరల్

వన్య మృగాలు మాంసం దొరక్కపోతే పస్తులుంటాయే కానీ ఆకులు, గడ్డి తిని కడుపు నింపుకోవు. కానీ ఒక సింహం గడ్డి తింటున్నప్పుడు తీసిన వీడియో వైరల్ అయింది. ఈ సింహానికి ఆకలై మాంసం దొరక్క గడ్డి తిందని అందరూ అభిప్రాయపడ్డారు. 
 
కానీ ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో మనకు తెలియదు. గుజరాత్‌లోని గిర్ అడవుల్లో నివసిస్తున్న ఓ సింహం పచ్చగడ్డి తిని ఆశ్చర్యపరిచింది. అమ్రెలీ జిల్లా ఖంభా ప్రాంతంలో సఫారీకి వెళ్లిన సందర్శకులకు ఈ దృశ్యం చిక్కింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే క్షణాల్లో వైరల్ అయ్యింది. 
 
ఈ వీడియోని చూసిన నెటిజన్లు మృగరాజు గడ్డి తినడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారు. దీనిపై షెత్రుంజీ రేంజ్ డిప్యుటీ కంజర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (డీసీఎఫ్) స్పందిస్తూ "అడవి మృగాలు గడ్డి తినడం సాధారణమే. 
 
అయితే, అవి కడుపు నింపుకోవడానికి గడ్డి తినవు. వాటి కడుపులో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు గడ్డి తింటాయి. కడుపులో జీర్ణంకాని పదార్థాలను ఆ గడ్డితోపాటు బయటకు కక్కేస్తాయి" అని తెలిపారు. ఇలా గడ్డి తింటున్న సింహాన్ని ఈ వీడియోలో ఓ లుక్కేయండి.