శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 డిశెంబరు 2019 (12:56 IST)

పంట పొలాల్లో పాట పాడుతూ వ్యవసాయం.. అదీ హిట్‌ సాంగ్.. వీడియో వైరల్

ఇంటర్నెట్ పుణ్యంతో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎక్కడో జరిగిన చిన్న విషయం వీడియోల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఇంతకీ ఆ వీడియో ఏంటంటే? ఓ రైతు జస్టిన్ బీబెర్ హిట్ సాంగ్ బేబీ ఆన్ ఫీల్డ్‌ను పాడాడు. ఈ పాటను అతను వ్యవసాయం చేస్తూ ఆలపించాడు. అంతే ఆ వీడియో వైరల్ అవుతోంది. 
 
నెటిజన్లు అమేజ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకా లైక్లతో పాటు విపరీతంగా షేర్ చేస్తున్నారు. మూడు నిమిషాల పది సెకన్లతో కూడిన ఆ యూట్యూబ్ వీడియోలో కర్ణాటకకు చెందిన రైతు పంట పొలాల్లో పాట పాడుతూ కనిపించాడు. ఈ పాటను మీరూ వినండి..