పాక్ ఆహ్వానాన్ని మన్నించిన మన్మోహన్? కర్తార్‌పూర్‌కు వెళ్తారా?
భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను పాకిస్థాన్ ఆహ్వానిస్తోంది. కర్తార్‌పూర్ సాహెబ్ కారిడార్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని పదేపదే విజ్ఞప్తి చేస్తోంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం నవంబరు ఏడో తేదీన జరుగనుంది. ఈ ఆహ్వానంపై మన్మోహన్ సింగ్ ఇప్పటివరకు నోరు మెదపలేదు.
కానీ, మన్మోహన్ సింగ్ మాత్రం పాకిస్థాన్‌కు వెళ్తున్నారు. మన్మోహన్‌తో పాటు పంజాబ్ సీఎం మరీందర్ సింగ్ కూడా కర్తార్‌పూర్ వెళ్లనున్నారు. అయితే ఆ వేడుకలో పాల్గొనేందుకు మన్మోహన్ వెళ్లడం లేదని కాంగ్రెస్ వర్గాలు మొదట్లో వెల్లడించాయి. దీనిపై గురువారం మరో క్లారిటీ వచ్చింది. ఆఖిల పక్ష పార్టీ నేతలతో కలిసి పాక్‌కు మన్మోహన్ వెళ్లనున్నట్లు తాజాగా తెలిసింది. గురునానక్ 550వ జయంతి వేడుకల్లో మాజీ ప్రధాని మన్మోహన్ పాల్గొంటారు.