శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By వి
Last Modified: బుధవారం, 26 ఆగస్టు 2020 (17:49 IST)

ప్రపంచ స్థాయిలో “మానవ క్యాలిక్యులేటర్” టైటిల్ రికార్డు సృష్టించిన 20 సంవత్సరాల విద్యార్థి

ప్రపంచ స్థాయిలో అత్యంత వేగవంతమైన మానవ క్యాలిక్యులేటర్ టైటిల్లో రికార్డు స్డష్టించిన శకుంతలా దేవి రికార్డును బద్దలు కొట్టాడు నీలకంఠ భాను ప్రకాశ్. హైదరాబాదుకు చెందిన నీలకంఠ భానుప్రకాశ్ డిల్లీ విశ్వవిద్యాలయం, స్టీఫెన్ కళాశాల, గణిత శాస్త్ర విభాగ విద్యార్థి. ప్రస్తుతం 20 సంవత్సరాల వయస్సు కలిగిన నీలకంఠ భానుప్రకాశ్ ప్రపంచ స్థాయిలో 50 లిమ్కా రికార్డులను కైవసం చేసుకున్నారు.
 
ప్రపంచ స్థాయిలో భారతీయుల గణిత శాస్త్ర మేధాశక్తిని చాటి చెప్పడమే తన లక్ష్యమని కొనియాడారు. ఆగస్టు 15న జరిగిన అంతర్జాతీయ మానవ క్యాలిక్యులేటర్ పోటీలో పాల్గొని బంగారు పతకాన్ని గెలుపొందారు. ఇందులో 13 దేశాలకు చెందిన దాదాపు 57 వయస్సు వరకు గల 30 మంది పార్టిసిపెంట్స్ పాల్గొన్నారు. ఇందులో తన గణిత శాస్త్ర మేధాశక్తిని  నిరూపించారు.
 
భారతదేశంలో గణిత ప్రయోగశాలను నెలకొల్పి అందులో కొన్ని మిలియన్ విద్యార్థులకు గణిత మేధాశక్తిని పెంపొందిస్తానని తెలిపారు. భారతదేశంలో ప్రతి నలుగురిలో ముగ్గురు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారని వారందరికి గణితంపై ఆసక్తి పెంపొందించి గణితంలో మేధస్సును కలుగజేస్తానని తెలిపారు. భారతదేశంలో ఎక్కువమంది విద్యార్థులు గ్రామాలలో విద్యను అభ్యసిస్తున్నారని వారికి తోడ్పడేలా తన గణిత శాస్త్ర ప్రయోగశాలను ఏర్పాటు చేసి అందరికి అవకాశం కల్పిస్తానని తెలిపారు.