స్వాప్నిల్ విద్యార్థినికి సోనూ సూద్ సాయం.. గ్రామానికే ఉచితంగా వైఫై

Sonu Sood
సెల్వి| Last Updated: మంగళవారం, 25 ఆగస్టు 2020 (12:21 IST)
Sonu Sood
మహారాష్ట్రలోని సింధూ దుర్గ్‌కు చెందిన స్వాప్నిల్ అనే విద్యార్థిని తన గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని కొండపైకి వెళ్లి చిన్నగుడిసె వేసుకుని అక్కడే చదువుకుంటోంది. ఈ యువతికి సినీ నటుడు సోను సూద్ తాజాగా ఓ గ్రామానికి సాయం చేశాడు.‌ ఆమె ఎంబీబీఎస్ ఎంట్రెన్స్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతోందని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న సోనూ సూద్ ఆమెతో పాటు ఆమె ఉంటోన్న ఊరి మొత్తానికి సాయం చేస్తున్నాడు.

ఆ గ్రామానికి ఉచితంగా వైఫై సౌకర్యం కల్పిస్తానని చెప్పాడు. సోను సూద్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. కాగా, ఆ
విద్యార్థిని ఓ చిన్న గుడిసెలో చదువుకుంటోన్న ఫొటోను ఒకరు పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది.

ఇకపోతే.. ఆన్‌లైన్‌ తరగతులు వినడానికి ఆమె గ్రామానికి ఇంటర్నెట్ సిగ్నల్ రాకపోవడంతో.. ఆమె సోదరుడి సాయంతో అక్కడ చదువుకుని సాయంత్రానికి ఇంటికి వస్తోంది. ఈ ఫోటో నెట్టింట వైరల్ కావడంతో సోనూసూద్ ఆమెతో పాటు ఆ గ్రామం మొత్తానికి సాయం చేశాడు.దీనిపై మరింత చదవండి :