శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 జనవరి 2022 (23:07 IST)

పెనంమీద గుడ్డు పగలగొట్టగానే అందులోంచి ఏమొచ్చిందంటే?

రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్. ఆమ్లెట్ ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ ఇవ్వడమే ఆలస్యం.. కుక్ ఓ గుడ్డును పగలగొట్టాడు. వెంటనే అక్కడ ఉన్నవారంతా షాక్‌ తిన్నారు. పెనంమీద గుడ్డు పగలగొట్టగానే అందులోంచి కోడి పిల్ల బయటకు వచ్చింది. అలా వరసగా 3 గుడ్లు పగలగొట్టగా మూడింటిలోనూ కోడి పిల్లలే ఉన్నాయి. దీంతో ఆ టిఫిన్ బండి వ్యక్తి షాకయ్యాడు. 
 
ఆ కోడి పిల్లలను పక్కనే ఉన్న మరో వ్యక్తికి అందించాడు. మాములుగా అయితే.. గుడ్లను కోడి పొదిగితేనే పిల్లలు తయారవుతాయి. కోడి పొదగడం వల్ల.. కోడిపిల్ల తయారవడానికి అవసరమైన వేడి దొరుకుతుంది. 
 
కానీ ఆశ్చర్యంగా ఇక్కడ ట్రేలో పెట్టిన గుడ్ల నుంచి పిల్లలు రావడంతో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. కాగా నెటిజన్లు ఈ వీడియోను తెగ సర్కులేట్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.