మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 జూన్ 2021 (15:10 IST)

సింహంతో పుట్టిన రోజు వేడుకలు.. చిక్కుల్లో పడిన పాకిస్థాన్ మహిళ

సింహంతో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ఓ మహిళ తన జన్మదిన వేడుకలకు సింహంతో చేసుకున్నారు. కానీ ఇప్పుడు చిక్కులో పడ్డారు. పూర్తి వివరాల్లోకెళ్తే.. పాకిస్థాన్ చెందిన ప్రభావశీలురాలు సుసాన్ ఖాన్ లాహోర్ లోని ఓ హోటల్ లో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అయితే జన్మదిన వేడుకలకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ సింహాన్ని వేడుకలకు తీసుకొచ్చారు. దానిని గొలుసులతో కట్టేసి కుర్చీలో కూర్చోబెట్టారు.
 
దానితో కొందరు పరిహాసం ఆడారు. సుసాన్ ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రొటెక్ట్ సేవ్ యానిమల్స్ ప్రతినిధుల కంటపడింది.ఇంకేముందు ఆ వీడియోను వారి ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేసి సుసాన్ ఖాన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూగజీవాలను పార్టీలకు తీసుకొచ్చి కట్టేసి ఇలా ఆనందం పొండకండి.. మిమ్మల్ని (సుసాన్ ఖాన్) కూడా అలాగే వేరే పార్టీలో కట్టేస్తే ఎలా ఉంటుందని అని ప్రశ్నించారు. దాంతో డిలీట్ చేసింది సుసాన్ ఖాన్.