శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (18:51 IST)

అమ్మో.. గోవాలో అలాంటి పార్టీనా..? సోషల్ మీడియాలో పోస్టర్ వైరల్

ఆధునిక పోకడలు, పాశ్చాత్య సంస్కృతి మన దేశంలో తాండవం చేస్తోంది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్లపై వున్న మోజుతో నేరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. మరోవైపు అకృత్యాలు, అక్రమ సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా గోవాలో పాశ్చాత్య సంస్కృతికి సంబంధించిన ఓ కార్యక్రమం కూడా జరగనుండగా.. పోలీసులు రంగంలోకి దిగారు. 
 
నూడ్ పార్టీ జరుగనుందని.. ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. ఉత్తర గోవాలో ఈ నూడ్‌ పార్టీ జరుగనున్నట్లు.. 10 నుంచి 15 మంది విదేశీ అందగత్తెలు, పది మంది భారతీయ మహిళలు ఇందులో పాల్గొంటున్నట్లు పోస్టర్ అతికించడం జరిగింది. కానీ గోవాలో ఎక్కడ జరుగుతుందనే కచ్చితమైన ప్రాంతం మాత్రం ఆ పోస్టర్‌లో కనిపించలేదు. 
 
ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో గోవా పోలీసులు రంగంలోకి దిగారు. ఇంకా గోవా మహిళా కాంగ్రెస్ చీఫ్ ప్రతిమా, సీఎం ప్రమోద్‌లు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా పోలీసులు తీవ్రంగా తనిఖీలు నిర్వహించారు. గోవాలో ఇలాంటి పార్టీలకు ఎట్టిపరిస్థితుల్లోనూ జరగనిచ్చేది లేదని ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు.