దూడ కోసం సింహాలు వేట.. ఒంటరి పోరు చేసిన బర్రె.. తర్వాత ఏం జరిగిందంటే? (video)
పులులు, సింహాలు తమ ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడతాయని తెలిసిందే. జింకలు వంటి ఇతర జీవులను వేటాడి తినడం వాటి నైజం. సోషల్ మీడియాలో పులులు, సింహాలు ఇతర జీవులను వేటాడే వీడియోలు కోకొల్లలు. అలాగే వాటి బారి నుంచి తప్పించుకోవడానికి సాధువులైన జీవులు ఫైట్ చేసే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా అలాంటి వీడియో నెట్టింట విపరీతంగా షేర్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. రెండు పులులు లేగదూడను వేటాడేందుకు ప్రయత్నించాయి. కానీ బర్రె పులులను కట్టడి చేసి దూడను కాపాడింది.
ఇందుకు కోసం పులులతో పోరాడింది. వీడియోలో మొదట ఒకటి రెండు పులులు దూడను వేటాడేందుకు చూశాయి. కానీ ఆపై నాలుగైదు పులుల గుంపు దూడను తినేయాలని భావించాయి.
కానీ తల్లి బర్రె దూడను కాపాడేందుకు ఒంటరి పోరు చేసింది. కానీ కాసేపటికే బర్రెల మంద .. పులుల గుంపును మూకుమ్మడిగా తరిమికొట్టాయి. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.