ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : సోమవారం, 17 సెప్టెంబరు 2018 (09:32 IST)

మైనర్లుగా ఉన్నపుడే పెళ్లి చేసుకున్న ప్రణయ్ - అమృత

పరువు హత్యకు గురైన ప్రణయ్ చిన్న వయసులోనే తన ప్రియురాలు అమృతవర్షిణిని రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తన కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న అక్కసు

పరువు హత్యకు గురైన ప్రణయ్ చిన్న వయసులోనే తన ప్రియురాలు అమృతవర్షిణిని రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తన కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న అక్కసుతో దళిత వర్గానికి చెందిన ప్రణయ్ అనే యువకుడుని అమ్మాయి తండ్రి కిరాయి మనుషులతో హత్య చేయించిన విషయం తెల్సిందే. ఈ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
 
మిర్యాలగూడకు చెందిన ప్రణయ్, అమృతలు హైస్కూల్‌లో కలసి ఎనిమిదో తరగతి చదువుకునే రోజుల్లోనే ప్రేమలో పడ్డారు. ఆపై కాలేజీ చదువుతున్న రోజుల్లో అతన్ని మరింతగా ఇష్టపడింది. ఆ సమయంలోనే రహస్యంగా పెళ్లి చేసుకున్న వారిద్దరూ, తమ పెళ్లి బయటకు తెలిస్తే గొడవలు జరుగుతాయన్న భయంతో, దాన్ని దాచిపెట్టారని కేసు విచారణలో భాగంగా అమృతను ప్రశ్నించిన పోలీసు వర్గాలు వెల్లడించాయి.
 
ఆపై హైదరాబాద్లో బీటెక్ చదువుతున్న రోజుల్లో వీరు నిత్యమూ కలిసేవారని, మైనారిటీ తీరిన నాలుగేళ్ల తర్వాత తమ రహస్య వివాహాన్ని చట్టబద్ధం చేసుకోవాలని భావించి, ఈ సంవత్సరం ప్రారంభంలో వివాహం చేసుకున్నారని, ఆ తర్వాతే ఇద్దరి ఇళ్లలో పెళ్లి గురించి చెప్పారని అన్నారు. దీంతో అప్పటివరకూ కులాంతర వివాహం వద్దని హెచ్చరిస్తూ వచ్చిన అమృత తండ్రి, పెళ్లయిందని, గర్భం దాల్చిందని తెలుసుకున్న తర్వాత సైకోగా మారి హత్యకు ప్లాన్ చేశారు. 
 
ఇందుకోసం తనను గతంలో కిడ్నాప్ చేసిన ఐసిసి ఉగ్రవాదితో పాటు.. నయీం మనుషులను ఆశ్రయించాడు. వారికి భారీ మొత్తంలో అంటే రూ.కోటి వరకు సుపారీ చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ ప్లాన్ ప్రకారమే ప్రణయ్‌ను కిరాయి హంతకులు హత్య చేసిపారిపోయారు.