మంగళవారం, 26 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2022 (20:27 IST)

విమానంలో మహిళకు పురిటినొప్పులు.. నవజాత శిశువు..?

flight
మలేషియా విమానంలో ఓ గర్భిణీ ప్రసవించింది. అయితే ఆ మహిళ జన్మనిచ్చిన నవజాత శిశువు మృతి చెందడంతో కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే.. టర్కీ నుంచి మలేషియా వెళ్తున్న విమానంలో మహిళ ప్రసవించింది. 
 
365 మంది ప్రయాణికులతో టర్కీ నుంచి మలేషియా వెళ్లే విమానం గాలిలో ఉండగా ఓ గర్భిణికి పురిటినొప్పులు వచ్చాయి. దీంతో విమానాన్ని చెన్నైలో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. 
 
విమానాశ్రయంలోని వైద్య బృందం విమానంలోకి వెళ్లి మహిళకు చికిత్స అందించింది. అయితే శిశువు మృతిచెందింది. దీంతో విషాదం నెలకొంది. కానీ మృత శిశువును మలేషియాకు తీసుకెళ్లినట్లు సమాచారం.