దేశం గొప్ప న్యాయకోవిదుడిని కోల్పోయింది : రాంనాథ్ కోవింద్
కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలానీ మృతిపట్ల రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇదే అంశంపై రాష్ట్రపతి విచారం వ్యక్తం చేశారు. తన వాగ్దాటితో ప్రజాసమస్యలను వెలుగులోకి తీసుకొచ్చేవారని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. గొప్ప న్యాయవాదిని, మేధావిని దేశం కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిర్భయంగా తన కర్తవ్యాన్ని నిర్వహించేవారని ఆయన సేవలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడారన్నారు. అవసరార్థులకు అండగా ఉండటం ఆయన ప్రత్యేకత అన్నారు. వివిధ అంశాలపై రామ్ జెఠ్మలానీతో మాట్లాడే అవకాశం రావడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నట్టు ప్రధాని మోదీ తెలిపారు.