మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 జనవరి 2020 (14:09 IST)

దీపికా పదుకునేకు దావూద్ ఇబ్రహీంకు సంబంధముందా? చెప్పిందెవరంటే?

దేశ రాజధాని నగరం ఢిల్లీలోని జేఎన్‌యూ వర్శిటీలో విద్యార్థులపై జరిగిన దాడిని బాలీవుడ్ నటి దీపికా పదుకునే ఖండించింది. ఇంకా జేఎన్‌యూ వర్శిటీలో విద్యార్థులను పరామర్శించింది. జేఎన్‌యూలోకి ధైర్యంగా వెళ్లి విద్యార్థులకు దీపికా మద్దతు తెలపడంపై బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు.
 
ఈ నేపథ్యంలో ఇప్పటికే నోటి దురుసు అంటూ ముద్ర వేసుకున్న బీజేపీ ఎంపీలు ఒకడుగు ముందుకేశారు. ఇంకా దావూద్ ఇబ్రహీంకు దీపికా పదుకునేకు సంబంధం వున్నట్లు బీజేపీ ఎంపీ రాజేష్ సిన్హా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జేఎన్‌యూ క్యాంపస్‌లోకి అంత ధైర్యంగా దీపికా వెళ్లడం వెనుక దావూద్ హస్తం వుందంటూ చెప్పారు. ప్రస్తుతం రాజేష్ సిన్హా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 
మరోవైపు జేఎన్‌యూలో కొందరు దుండగులు ముసుగులు ధరించి విద్యార్థులపై కర్రలు, రాడ్లతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డిన సంగతి తెలిసిందే. దాడి ఘటనపై పెద్ద ఎత్తున నిరసలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దుండగుల దాడిలో గాయపడిని వారిని తమిళనాడు డీఎంకే ఎంపీ కనిమొళి పరామర్శించారు. ఇంకా జేఎన్‎‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్‌తో కనిమొళి మాట్లాడారు. దాడికి సంబంధించిన వివరాలు ఆయిషీ ఘోష్‌ను అడిగి తెలుసుకున్నారు. 
 
దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలన్నారు. మంగవారం బాలీవుడ్ నటి దీపికా పదుకునే బాధితులు పరామర్శించారు. ఈ నేపథ్యంలో దీపిక పదుకొనేను పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

దీనిపై కనిమొని స్పందించారు. దీపికా పదుకొనేను నెటిజన్లు ట్రోలింగ్ చేయడం తప్పుబట్టారు. దీపికా సినిమాలు చూడొద్దని నెటిజన్లు పిలుపునివ్వడం సరైంది కాదన్నారు. ఇప్పటి వరకు తాను హిందీ సినిమాలు చూడలేదని, దీపిక మద్దతుగా ఆమె నటించిన హిందీ చిత్రం ఛపాక్ చూస్తానని స్పష్టం చేశారు.