గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By మోహన్
Last Updated : గురువారం, 7 మార్చి 2019 (12:04 IST)

అధికార పార్టీకి చెందిన ఎంపీ.. ఎమ్మెల్యే బూట్లతో కొట్టుకున్నారండోయ్..

సాధారణంగా రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం మామూలే. అయితే తాజాగా ఎంపీ, ఎమ్మెల్యేలు ఒకరినొకరు బూట్లతో చితక్కొట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఓ సమావేశంలో ఇద్దరు ప్రజాప్రతినిధులు బూట్లతో కొట్టుకున్నారు. అది కూడా ఒక ఎంపీ, మరొకరు ఎమ్మెల్యే. వీరిద్దరూ అధికార పార్టీకి చెందిన వారే కావడం విశేషం. 
 
భారతీయ జనతాపార్టీకి చెందిన వీరిద్దరూ ఒకరిపై ఒకరు బూట్ల దాడికి దిగారు. ఒకరినొకరు చితక్కొట్టుకున్నారు. యూపీ మంత్రి అశుతోష్ టండన్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో కబీర్ నగర్ ఎంపీ శరద్ త్రిపాఠీ, మెహదావల్ ఎమ్మెల్యే రాకేశ్ సిన్హ్ మధ్య మాటామాటా పెరిగి కొట్టుకునేంత వరకు వెళ్లింది. 
 
కోపంతో ఊగిపోయిన ఎంపీ ఎమ్మెల్యేను బూటుతో చిటక్కొట్టారు. బాధ్యుతాయుతంగా ప్రవర్తించాల్సిన ప్రజా ప్రతినిధులే ఇలా ఒకరిపై ఒకరు దాడులకు దిగుతుంటే, ప్రజలను ఎలా రక్షిస్తారు అని ఇతర పార్టీల నాయకులు వాపోతున్నారు. వీరిద్దరిపై వేటు పడాల్సిందే అంటూ అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రజాప్రతినిధులే ప్రత్యక్షంగా దాడులకు దిగడం సర్వత్రా చర్చనీయాంశమైంది.