1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Real Hero: RPF constable runs along moving train to to give milk for 4-month-old

పోలీస్ చిరుతపులి : రియల్ హీరో సుందర్‌కు ప్రశంసల వెల్లువ.. ఎందుకు?

RPF Constable
ఆయనో రైల్వో పోలీస్. కానీ, ఆయన చేసిన పనికి ఇపుడు దేశం మొత్తం అభినందనల్లో ముంచెత్తుతోంది. పైగా, ఆయన ఓ పోలీస్ కాదనీ, చిరుతపులతో పోల్చుతున్నారు. ఓ పసిబిడ్డ ఆకలి తీర్చేందుకు ఓ తల్లి ప్రయత్నానికి తన వంతు సహకారం అందించాడు. ఈ వ్యవహారం మొత్త సీసీటీవీ కెమెరాల్లో నమోదై, చివరకు రైల్వే మంత్రి పియూష్ గోయల్ దృష్టికి వెళ్లింది. అంతే.. ఆ పోలీస్ చిరుతకు నగదు బహుమతిని ప్రకటించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్‌కు వెళుతున్న ఓ రైలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌ స్టేషన్‌లో ఆగింది. ఆ రైలులో నాలుగు నెలల చిన్నారితో పాటు ఓ మహిళ ప్రయాణిస్తోంది. తన వద్ద ఉన్న పాలు అయిపోవడంతో ప్లాట్ ఫాంపై ఉన్న రైల్వే పోలీసు ఇందర్ యాదవ్‌ను సాయం కోరింది. 
 
అయితే ఇందర్ యాదవ్ పాల ప్యాకెట్ తెచ్చేలోపే రైలు కదిలింది. అయితే, ఆ చిన్నారి ఆకలి, తల్లి వేదన గుర్తు తెచ్చుకున్న ఇందర్ యాదవ్ రైలు వెంబడి చిరుతలా పరుగెత్తాడు. భుజానికి బరువైన రైఫిల్ వేళ్లాడుతున్నా వెనుదీయకుండా, తన శక్తిమేర ఓ మహిళ ఉన్న బోగీ వెంట పరుగులు తీశాడు. చివరికి పాలను ఆ తల్లికి అందించి తన పరుగును ఆపాడు. 
 
ఈ వ్యవహారమంతా స్టేషన్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డయింది. ఈ ఘటన రైల్వే మంత్రి పియూష్ గోయల్ దృష్టికి వెళ్లడంతో, రైల్వే పోలీసు ఇందర్ యాదవ్ ను అభినందించారు. నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు.
 
ఇదిలావుంటే, తన ఇంటికి చేరుకున్న ఆ మహిళ రైల్వే పోలీసు ఇందర్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంది. ఒక హీరోలాగా తన బిడ్డ ఆకలి తీర్చాడని, పాలు లేకపోవడంతో బిడ్డకు నీళ్లలో ముంచిన బిస్కెట్లు తినిపించాల్సిన అగత్యం నుంచి తప్పించారని కొనియాడింది. 

 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
తల్లికోసం గుక్కపెట్టిఏడ్చిన చిన్నారి... బావిలోపడేసిన గొర్రెకుంట 'కసాయి'