కరోనా భయం.. ఫిట్‌నెస్‌లో 50శాతం మెరుగైన చైనీయులు.. కారణం?
తుమ్మినా, దగ్గినా కరోనా పేషెంట్లను తాగినా కరోనా వైరస్ సంక్రమిస్తుంది. ఈ కరోనా వైరస్ నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం ఫిట్‌గా వుండాలని సూచించింది. కరోనా ధాటికి జిమ్‌లు, ఫిట్‌నెస్ సెంటర్లు మూసేయడంతో 1.4 బిలియన్ మంది ఇళ్లలోనే ఫిట్‌నెస్ కోసం ట్రై చేయాలని చెప్పింది.
తోచిన విధంగా కసరత్తులు చేయడం మొదలుపెట్టేశారు. దీంతో వాటర్ బాటిల్స్ ఎత్తడం, పిల్లలను ఎత్తుకుని పుషప్ప్ చేయడం, మెట్లు ఎక్కడం వంటి ఇండోర్ టెక్నిక్స్‌ను ఫాలో అవుతున్నారు చైనా జనం. కానీ ఓ వ్యక్తి మాత్రం మారథాన్ మొదలెట్టేశాడు. అదీ ఇంట్లోనే.
పాన్ శాంచు(44) అనే వ్యక్తి ఏకంగా అపార్టెమ్ంట్‌లో మారథాన్‌నే మొదలుపెట్టేశాడు. ఆరు గంటల 41నిమిషాలు కష్టపడి 66కిలోమీటర్లు పరిగెత్తేశాడు. అనుమానముంటే డేటా ట్రాకర్‌తో నిరూపిస్తానని కూడా చెప్పాడు. ఈ కరోనా ప్రభావంతో చైనావాసులు జనవరి 23నుంచి ఫిబ్రవరి 5 మధ్య కాలంలో రెండు వారాల కంటే ముందున్న ఫిట్ నెస్‌లో 50శాతం మెరుగయ్యారట.