మంగళవారం, 14 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : శుక్రవారం, 6 జులై 2018 (17:28 IST)

నా పిల్లల తండ్రి పవన్ కళ్యాణ్ గురించి నేను అలా మాట్లాడాలా? స్టుపిడ్ ఫెలో: రేణూ దేశాయ్

ట్విట్టర్ ట్రోలింగ్ తట్టుకోలేక దాన్ని మూసేసి ఇన్‌స్టాగ్రాంలో పోస్టులు చేస్తున్న రేణూ దేశాయ్‌ను కొంతమంది రకరకాల సందేశాలతో విసిగిస్తున్నారట. పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా రేణూ దేశాయ్ పేరుతో ఓ ఇమేజ్ సోషల్

ట్విట్టర్ ట్రోలింగ్ తట్టుకోలేక దాన్ని మూసేసి ఇన్‌స్టాగ్రాంలో పోస్టులు చేస్తున్న రేణూ దేశాయ్‌ను కొంతమంది రకరకాల సందేశాలతో విసిగిస్తున్నారట. పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా రేణూ దేశాయ్ పేరుతో ఓ ఇమేజ్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుండటం రేణూ దృష్టికి కూడా వెళ్లింది. దీనిపై రేణూ దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తను ఎన్నో ఏళ్లుగా అన్నీ భరిస్తూ వస్తున్నాననీ, తన తప్పు లేకున్నప్పటికీ అన్నీ భరించాలని అంటున్నారంటూ మండిపడింది. 
 
పవన్ కళ్యాణ్ గారి పేరుప్రతిష్టలకు ఎప్పుడు భంగం కలిగితే అప్పుడు నేను వచ్చి మాట్లాడాలా? ఇలాంటి సంఘంలో జీవిస్తున్నందుకు బాధపడుతున్నాను. అసలు నేను పవన్ కళ్యాణ్ గారి గురించి పబ్లిక్‌లో మాట్లాడాల్సిన అవసరం లేదు. నా పిల్లల తండ్రి అయిన పవన్ గురించి వ్యతిరేకంగా మాట్లాడమని ఓ స్టుపిడ్ ఒత్తిడి తెచ్చాడు. 
 
ఐనా ఏ రాజకీయ పార్టీ కూడా నన్ను ఇన్‌ఫ్లూయెన్స్ చేయలేదు అంటూ ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. తనకు ఎప్పటికైనా ప్రశాంతత దొరుకుతుందని భావిస్తున్నానంటూ వెల్లడించారు. కాగా ఇటీవలే రేణూ దేశాయ్ రెండో పెళ్లి చేసుకునేందుకు నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.