గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 అక్టోబరు 2022 (18:36 IST)

రెండు తలల పాము.. నెట్టింట వీడియో వైరల్ (video)

Two headed snake
Two headed snake
రెండు తలల పాము వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అమెరికాలోని నార్త్ కరోలినాలో పాముల ఫామ్ నిర్వహిస్తున్న జిమ్మీ మేబ్.. ఇలాంటి ఓ అరుదైన రెండు తలల పాము గురించిన విషయాలు వైరల్ అవుతున్నాయి. 
 
ఆరెంజ్, తెలుపు రంగుల పట్టీలతో ఉన్న ఈ పాము.. "హొండూరన్ అల్బినో మిల్క్ స్నేక్" జాతికి చెందినదని వెల్లడించారు. రెండు తలలు, ఒకే శరీరం ఉండటంతో ఆ పాము కదలికలు, ఇతర అంశాల్లో ఏ తల నిర్ణయం తీసుకుంటుందన్న సందేహాలకు జిమ్మీ వివరణ ఇచ్చాడు. 
 
ఏ తల నేలకు ఆని ఉంటే.. ఆ తల నిర్ణయానికి అనుగుణంగా పాము శరీరం వ్యవహరిస్తుందని తెలిపారు. చేతిని దగ్గరగా పెడితే రెండు తలలతోనూ కాటు వేస్తుందని వివరించారు. అయితే ఈ పాములో విషం ఉండనందున ప్రమాదమేమీ లేదని పేర్కొన్నారు.