శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 26 అక్టోబరు 2019 (22:41 IST)

కదులుతున్న రైలును పరుగెత్తుకుంటూ ఎక్కబోయాడు-video

కదులుతున్న రైలును ఎక్కరాదు, దిగరాదు అని ఎన్నిసార్లు చెప్పినా కొందరు ప్రయాణంలో హడావుడి పడుతూ పొరబాటు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. ఇలాంటి ఘటనల్లో కొందరు ప్రాణాలు కోల్పోతే మరికొందరు అదృష్టవశాత్తూ ప్రాణాల నుంచి బయటపడతారు.
ఇలాంటి ఘటనే కోయంబత్తూరులో జరిగింది. ఓ ప్రయాణికుడు కదులుతున్న రైల్లో ఎక్కబోతూ జారి పడ్డాడు. ఐతే ఫ్లాట్ ఫాం పైన వున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసు అతడి ప్రాణాలను కాపాడాడు. దాంతో అతడికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఎలాగో ఈ వీడియోలో చూడండి.