శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (17:19 IST)

ఎకరం భూమిలో 2500 కిలోల బియ్యంతో సోనూసూద్ చిత్రపటం

Sonu Sood
Sonu Sood
మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లోని తుకోజీ రావ్ పవార్ స్టేడియంలో ఒక ఎకరానికి పైగా భూమిలో 2500 కిలోల బియ్యాన్ని ఉపయోగించి అభిమానులు.. నటుడు సోనూసూద్ చిత్ర పటాన్ని రూపొందించారు. 
 
దీనికోసం సోనూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, "ప్రతిసారీ నాకు లభించే ప్రేమ, అభిమానం ఎనలేనిది. అభిమానులు ఇతరులకు సహాయం చేయడానికి తమ సామర్థ్యంతో ఏం చేస్తున్నారనేదే ముఖ్యం. ఇది చూసి నా హృదయం నిండిపోయింది." అంటూ చెప్పారు. 
 
ఎకరం స్థలంలో సోనూ చిత్రాన్ని రూపొందించారు. చిత్రం కోసం ఉపయోగించిన బియ్యాన్ని 'హెల్పింగ్ హ్యాండ్స్' స్వచ్ఛంద సంస్థ ద్వారా అవసరమైన, కనీస సౌకర్యాలు లేని కుటుంబాలకు అందజేస్తుంది. ఇదిలా ఉంటే, సోనూసూద్ ప్రస్తుతం జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో కలిసి 'ఫతే' సినిమా షూటింగ్‌లో ఉన్నాడు. సోనూ సూద్ ఇటీవలే తాను హోస్ట్ చేయనున్న ప్రముఖ టెలివిజన్ షో రోడీస్ రాబోయే సీజన్‌ను కూడా ప్రకటించాడు.