బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎఎం వాసుదేవన్
Last Modified: శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (12:14 IST)

ఆ నలుపు చొక్కాలు అయ్యప్ప దీక్ష కోసం కాదు... ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం...(Video)

ఇన్నాళ్లూ స్పెషల్ స్టాటస్‌లు వద్దు... దానితో ఏమీ ప్రయోజనం లేదని అందరినీ దుయ్యబట్టి... కాదు ప్రత్యేక హోదానే కావాలన్న ప్రతి ఒక్కరినీ చీరేసిన బాబుగారికి ఎన్నికలు ముంచుకొచ్చే సమయానికి ప్రత్యేక హోదా కావలసి వచ్చేసింది. తాను ప్రధానిగారిని సార్ అన్నా కూడా కనికరించలేదని వాపోయి... నిరసన తీర్మానాలు చేసేసిన చంద్రన్న తన పసుపు చొక్కాని కాస్తా నల్లగా మాడ్చుకునేసి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు నల్లచొక్కాతో హాజరయ్యారు. 
 
ముఖ్యమంత్రిగారితోపాటు సదరు ఎమ్మెల్యేలు కూడా నల్లచొక్కా ధరించి రాష్ట్రానికి చేసిన అన్యాయంపై కేంద్రానికి నిరసన తెలియజేయడం కొసమెరుపు. టీడీపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది నల్లచొక్కాల్లోనే అసెంబ్లీకి రాగా, కొందరు నల్లచొక్కా, నల్లప్యాంటు వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. అందరూ మూకుమ్మడిగా కేంద్రంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
 
ఏపీ హక్కుల సాధనకు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు సీఎం కార్యచరణ ప్రకటించారు. విభజన చట్టం అమలులో కేంద్రం మొండి చేయి చూపిస్తున్నందుకు నిరసనగా ఫిబ్రవరి 1ని నిరసన దినంగా పాటించాలని పిలుపునిచ్చిన చంద్రన్న ఉన్నట్టుండి ఇప్పుడెందుకు నిద్ర లేచారో జగమెరిగిన సత్యమే. కాగా ఒక్కసారిగా నల్ల దుస్తుల్లో దర్శనమివ్వడంతో అయ్యప్ప దీక్ష ఇప్పుడేంటి అని కొందరు సెటైర్లు వేస్తున్నారు.. చూడండి సీఎం నల్లచొక్కాలో... వీడియో.