1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (11:17 IST)

బ్యాంక్ లాకర్‌లలో డబ్బులు దాచితే.. చెదలు పట్టాయి..

బ్యాంక్ లాకర్‌లలో డబ్బులు దాచాలి అనుకునేవారికి ఇది షాకింగ్ న్యూస్. ఎందుకుంటే బ్యాంకు లాకర్‌లో పెట్టిన డబ్బుకు చెదలు పట్టాయి. దీంతో ఆ అకౌంట్ హోల్డర్ తలపట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన ఉదయ్‌పూర్‌లోని కాలాజీ గోరాజీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే...  సునీతా మెహతా అనే అకౌంట్ హోల్డర్, లాకర్ నంబర్ 265లో భద్రపరిచిన తన నోట్లు తెగుళ్ల వల్ల 15వేల విలువ గల నోట్లు పూర్తిగా పాడైపోయాయని, రూ.500 నోట్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయని గుర్తించారు. సునీత వెంటనే బ్యాంకులో ఫిర్యాదు చేయగా, పురుగు సోకడంతో పోగొట్టుకున్న రూ.15 వేలు తిరిగి చెల్లించారు. 
 
ఈ సంఘటన బ్రాంచ్ కార్యాలయానికి చేరుకున్న ఇతర ఖాతాదారులను ఆందోళనకు గురిచేసింది. బ్యాంకు నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఖాతాదారులు ఆరోపించడంతో.. బ్యాంక్ క్షమాపణలు కోరుతూ.. సరైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.