శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : బుధవారం, 11 జులై 2018 (10:17 IST)

వరదల్లో చిక్కుకున్న రైలు ప్రయాణికులు.. రక్షించిన వెస్ట్రన్ నేవీ కమాండ్

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ కారణంగా ఏర్పడిన వరదల్లో అనేక మంది ప్రజలు చిక్కుకున్నారు. ముఖ్యంగా, అనేక చోట్ల రైలు పట్టాలు వరద ఉధృతికి

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ కారణంగా ఏర్పడిన వరదల్లో అనేక మంది ప్రజలు చిక్కుకున్నారు. ముఖ్యంగా, అనేక చోట్ల రైలు పట్టాలు వరద ఉధృతికి కొట్టుకునిపోయాయి. దీంతో రైళ్ళ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
 
ఈ పరిస్థితుల్లో నాలా సోపారా - వాసై రోడ్ స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్స్ బాగా దెబ్బతిన్నాయి. దీంతో నాలా సొపొరా స్టేషన్‌లో రైలు ప్రయాణికులు చిక్కుకుని పోయారు. వీరిని మంగళవారం రాత్రి వెస్ట్రన్ నావల్ కమాండ్ సురక్షితంగా రక్షించింది.
 
వెస్ట్రన్ రైల్వే ఉన్నతాధికారుల విజ్ఞప్తి మేరకు రంగంలోకి దిగిన నేవీ.. భారీ వాహనాల సాయంతో వీరిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించింది. గత గత 48 గంటల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ముంబై మహానగరం నీట మునిగిన విషయం తెల్సిందే. అనేక లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తి జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రమాదంలో చిక్కున్న ముంబై నగర వాసులను రక్షించే పనుల్లో ఇండియన్ నేవీ నిమగ్నమైవుంది.