శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 5 నవంబరు 2019 (18:26 IST)

టిటిడిలో మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులకి లైన్ క్లియర్

మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులకు లైన్ క్లియర్ అవుతోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో రమణదీక్షితులుకు ఆలయప్రవేశాన్ని తితిదే కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆయనను ఆగమ సలహాదారుడిగా నియమించనున్నట్లు తెలుస్తోంది.
 
నూతన అర్చకులకు మార్గదర్శకుడిగా రమణదీక్షితులు సేవలను వినియోగించుకోవాలని టిటిడి భావిస్తోంది. కోర్టు కేసులు పరిష్కారం తరువాత అర్చకత్వ భాద్యతలను అప్పగించాలని తితిదే యోచిస్తున్నట్లు సమాచారం.

కాగా ఎన్నికల సమయంలో రమణదీక్షితులు సీఎం జగన్‌ను కలిశారు. అప్పట్లో ఆయనకు జగన్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.