బుధవారం, 29 నవంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 మే 2022 (15:31 IST)

మెక్‌డొనాల్డ్స్ శీతల పానీయంలో బల్లి..

Mc donald
Mc donald
మెక్‌డొనాల్డ్స్ శీతల పానీయంలో బల్లి చనిపోయిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ దేవాంగ్ పటేల్ రంగంలోకి దిగారు. 
 
పరీక్ష కోసం అవుట్‌లెట్ నుంచి శీతల పానీయాల నమూనాలను సేకరించి.. ఆ తర్వాత అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటన తర్వాత శనివారం గుజరాత్‌లోని సోలా మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్‌ను సీలు చేసింది.
 
కస్టమర్ భార్గవ జోషి తన శీతల పానీయంలో బల్లి ఈదుతున్న వీడియోను శనివారం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. భార్గవ జోషి.. అతని స్నేహితులు సోలాలోని మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్‌లో తమ ఫిర్యాదును ఎవరూ తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. 
 
అయితే కూల్ డ్రింక్ కోసం చెల్లించిన రూ. 300 వాపసు ఇచ్చినట్లు తెలిపారు. ఆ తర్వాత భార్గవ జోషి అహ్మదాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు.