viral video- కరోనావైరస్ టీకా తీసుకుంది, కెమెరాల ముందే దబ్బున పడిపోయింది
కరోనావైరస్. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి. ఈ వైరస్‌ను నిరోధించేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. టీకాలను కనుగొనేందుకు ఆయా దేశాల శాస్త్రజ్ఞులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. కొన్ని టీకాలు ట్రయల్స్ దశలో వుండగా, మరికొన్ని పరీక్ష దశలో వున్నాయి. ఐతే ట్రయల్స్ దశలో వున్న కొన్ని కరోనా టీకాల వల్ల పలువురు అస్వస్థతకు గురువుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి.
తాజాగా అమెరికాలో ఫైజర్-బయోఎన్ టెక్ కోవిడ్ 19 వ్యాక్సిన్ షాట్ తీసుకుంది టిఫనీ డోవర్ అనే హెడ్ నర్స్. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. టీకా తీసుకున్నందుకు చాలా సంతోషంగా వుందంది. ఆమె అలా మాట్లాడుతూ వుండగానే... తల పట్టుకుంది.
నాకేదో మైకంగా వుందంటూ అక్కడే కుప్పకూలిపోయింది. పక్కనే వున్నవారు పట్టుకున్నప్పటికీ ఆమె అలాగే కింద పడిపోయింది. దీంతో అక్కడున్న వారంతా షాక్ తిన్నారు. ఇదంతా కెమేరాల్లో రికార్డయింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కాగా ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా వున్నట్లు సమాచారం.