మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (13:37 IST)

వరుడికి చెంపదెబ్బ.. కాబోయే భార్యకు దండవేయబోతుండగా...?

bride
పెళ్లికి వచ్చిన అతిథులు షాకయ్యారు. కారణం తన మెడలో దండ వేయడానికి వచ్చిన వరుడిని వధువు చెంపమీద లాగిపెట్టి కొట్టింది. ఒక్కసారి కాదు.. రెండుసార్లు అలాగే కొట్టింది. 
 
ఆ తరువాత దండను విసిరేసి స్టేజ్ మీదినుంచి దిగి పరిగెత్తుకుంటూ పెళ్లి హాల్ నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో ఓ పెళ్లి వేడుక జరుగుతుంది. వరుడు తనకు కాబోయే భార్యకు దండ వేయడానికి ఉత్సాహంగా ఉన్నాడు.
 
ముహూర్తం సమీపించగానే దండను ఆమె మెడలో వేయబోయాడు. అంతే ఒక్కసారిగా వధువు నుంచి అనుకోని రియాక్షన్ వచ్చింది. 
 
వరుడు వేసే దండను స్వీకరించడానికి బుదులుగా ఆమె అతని ముఖం మీద గట్టిగా కొట్టింది. ఈ ఘటనతో ఇరువర్గాల బంధువులు, కుటుంబీకులు షాక్ అయ్యారు. 
 
ఆ తరువాత ఇరువైపులా కుటుంబసభ్యుల జోక్యంతో ఇరువర్గాల మధ్య సఖ్యత కుదిరిందని సమాచారం. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.