శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 ఏప్రియల్ 2022 (21:35 IST)

పెళ్లైన మూడు రోజులకే ఎంత పనిచేసింది..

bride
పెళ్లైన మూడు రోజులకే నవ పెళ్లి కూతురు పరారైంది. మూడు రోజులు గుట్టుగా వుండి మామ, అత్తకు పాలలో మత్తుపదార్థం కలిపి ఇచ్చింది. ఇంట్లో ఉన్న బంగారు నగలు, నగదును తీసుకుని పరారైంది. 
 
బయటకెళ్లి ఇంటికి చేరుకున్న భర్తకు విషయం అర్థమైంది. వెంటనే అతను పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలిస్తుండగా ఆమె నేరుగా పీఎస్‌కు వచ్చి లొంగిపోయింది.
 
ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీకి చెందిన తివారీ అనే వ్యక్తికి గత నెల 19న మహారాష్ట్రకు చెందిన మహిళతో వివాహమైంది. అత్తగారింటిలో మూడురోజులపాటు భర్త, అత్తమామలతో మంచిగానే ఉంది.
 
మూడో రోజు భర్త ఇంట్లో నుంచి పని పైన బయటకు వెళ్లాడు. ఇంట్లో ఉన్న మామ, అత్తకు పాలలో మత్తు పదార్థం కలిపి ఇచ్చింది. వారు అపస్మారక స్థితికి వెళ్లాక ఇంట్లో ఉన్న నగదు, నగలతో పరారైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు.