మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 సెప్టెంబరు 2022 (12:02 IST)

కింగ్ కోబ్రాను పట్టుకోబోయాడు.. భలే బుద్ధి చెప్పిందిగా.. (video)

King Cobra
King Cobra
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం చాలా ప్రమాదకరమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వ్యక్తి నాగుపామును పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న వీడియో అందర్నీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ వీడియోలో పామును పట్టే వ్యక్తికి మంచి గుణపాఠం నేర్పిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
 
ఓ స్నేక్ క్యాచర్ ప్రమాదకర కింగ్ కోబ్రా పామును చేతితో పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండటాన్ని వీడియోలో చూడవచ్చు. ఈ క్రమంలో పామును శాంతింపజేసేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నాడు. పాము ఒక్కసారిగా ఆగ్రహం చెంది వ్యక్తిపై దాడి చేసింది. ఈ వీడియో పాతదైనా ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.