ఆ రెండు స్థానాలపైనే పవన్ గురి ఎందుకు..?
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖజిల్లా గాజువాక నుంచి బరిలోకి దిగబోతున్నారు పవన్ కళ్యాణ్. ఇదంతా జరిగిన విషయమే. జనరల్ బాడీ మీటింగ్‌లో సుధీర్ఘంగా చర్చించిన తరువాత పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయానికి వచ్చేశారు. చివరకు మేధావుల సలహాతో గాజువాకను ఎంచుకున్నారు పవన్ కళ్యాణ్. అనూహ్యంగా భీమవరం ఎందుకు తెరపైకి వచ్చింది. జనసేన అధినేత గాజువాక నుంచి పోటీ చేస్తారని ముందు నుంచి ప్రచారం జరిగింది.
తన అన్న చిరంజీవి లాగానే రెండు స్థానాలను పవన్ కళ్యాణ్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది. గాజువాక ప్రాంతమంటే పవన్‌కు బాగా ఇష్టం. అభిమానులు కూడా ఇక్కడి నుంచే పోటీ చేయాలని ఒత్తిడి కూడా ఉంది. లక్షకు పైగా జనసేన పార్టీలో నేతలు చేరారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎక్కువ మంది ఇక్కడి నుంచే ఉన్నారు. అందుకే ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. సేఫ్ సైడ్‌గా మరో స్థానాన్ని ఎంచుకున్నారు పవన్ కళ్యాణ్.
భీమవరంలో కూడా జనసేన సైనికులు ఎక్కువమందే ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అంటే కూడా పవన్‌కు ఎంతో ఇష్టం. తన లెక్క ప్రకారం రెండు నియోజకవర్గాల్లో గెలుపు ఖాయమన్నది పవన్ ఆలోచన. అందుకే రెండు నియోజకవర్గాల్లోను పోటీ చేసి ఏదో ఒక ప్రాంతాన్ని చివరగా ఎంచుకోబోతున్నారు.