బెనారస్ పట్టుచీరలో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?

Kamala Harris
సెల్వి| Last Updated: మంగళవారం, 19 జనవరి 2021 (22:37 IST)
kamala harris
అగ్రరాజ్యం అమెరికా వైపే ప్రపంచ దేశాలు కన్నేసివున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా జో బైడన్, అమెరికా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కమలా హారిస్ చీరకట్టులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారతీయ మూలాలున్న కమల.. సంప్రదాయ చీరకట్టులో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది.

భారతీయ సంస్కృతి, వారసత్వంపై తనకు అమితమైన గౌరవం ఉందని, తన తల్లి తనను అలా పెంచారని కమల చాలా సందర్భాల్లో తెలిపారు. ఇంటి పేరుతో సంబంధం లేకుండా తాము అన్ని పండుగలను జరుపుకుంటామన్నారు.

కమల తల్లి శ్యామలా గోపాలన్ చెన్నైలో పుట్టి పెరిగారు. తర్వాత అమెరికాకు వలస వెళ్లి స్థిరపడ్డారు. అయినప్పటికీ భారతీయ సంప్రదాలను ఆమె ఏనాడూ విడిచిపెట్టలేదు. కమలకు కూడా చిన్ననాటి నుంచే వాటిని నేర్పించారు.

ప్రమాణ స్వీకార సమయంలో ఆమె బెనారస్ పట్టుచీరలో కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ బిబు మొహాపాత్రా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో కమలా హారిస్ చీరకట్టులో అమెరికా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణం చేస్తారనే .ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది.దీనిపై మరింత చదవండి :